ప్రధాని మోడీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం కొలువుదీరింది. ఈసారి కొత్తవారికి, యూత్‌కు కూడా ఎన్‌డిఎ సర్కార్‌ పెద్ద పీట వేసింది. అందులో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిషిత్‌ ప్రమాణిక్‌ (35). చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. యువజన, క్రీడాశాఖ సహాయ మంత్రి పదవి నిషిత్‌కు వరించింది. 1986, జనవరి 17న బెంగాల్‌లోని దిన్‌హతాలో జన్మించిన నిషిత్‌, బాలకూర జూనియర్‌ బేసిక్‌ స్కూల్‌ నుండి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్‌ పట్టా పొందారు. ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేసి 2019లో బిజెపిలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూచ్‌ బిహార్‌ నియోజక వర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు.