టాలీవుడ్ ఎలిజబుల్ బ్యాచ్లర్ హీరోలలో ఒకరైన హీరో నితిన్ ఇంట ఈ నెలలోనే పెళ్లి మంత్రాలు వినిపించనున్నాయి. కరోనా వైరస్ ప్రభావం వలన ఏప్రిల్ నెలలో జరగాల్సిన నితిన్ పెళ్లి వాయిదా వేసుకోక తప్పలేదు. ఏప్రిల్ నెలలోనే చాలామంది శుభకార్యాలు పెళ్లిళ్లకు ముహూర్తాలను సెట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా భీష్మ సినిమాతో హిట్ అందుకున్న హీరో నితిన్. ఏప్రిల్ లోనే దుబాయ్ లో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో కరోనా వైరస్ చెలరేగడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సల్ చేసుకున్నాడు. ఇక అప్పుడు వాయిదా పడిన నితిన్ షాలిని పెళ్లి పనులు నేడు వైభవంగా ఆయన స్వగృహంలో మొదలయ్యాయి. ఇరువురి కుటుంబాలు పెళ్లి కార్యక్రమాలతో హడావిడిగా ఉన్నారు. తాజాగా నితిన్ షాలిని నిశ్చితార్థ వేడుక కొందరు సన్నిహితుల మధ్య జరిగింది. షాలినికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతున్న ఫొటోను హీరో నితిన్ తన ట్విట్టర్లో ఇటీవల షేర్ చేశాడు.

ఇక ఈ యంగ్ హీరో నితిన్ డాక్టర్ షాలినిల పెళ్లి సంబరాలు ఐదు రోజులపాటు జరగనున్నాయట. ఈరోజే వీరి పెళ్లి సందడి ప్రారంభం అయింది. నితిన్ షాలిని కుటంబాల పెద్దలు నిశ్చయ తాంబూళాలు మార్చుకున్న తర్వాత నిశ్చితార్థ వేడుక నిర్వహించారట. నితిన్ షాలినిల కుటుంబ సభ్యులతో పాటు పలువురు బంధుమిత్రుల సమక్షంలో వెడ్డింగ్ రింగ్స్ మార్చుకున్నారు. హైదరాబాద్ లోని ఫలక్నుమా ప్యాలస్ నందు జులై 26న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నితిన్ షాలిని మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ యంగ్ హీరో తన వివాహానికి కొందరు సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ సూచనలు నిబంధనలు పాటిస్తూనే వేడుక నిర్వహించనున్నారని సన్నిహితులు తెలిపారు. మొత్తానికి టాలీవుడ్లో మరో బ్యాచిలర్ వికెట్ పడబోతుందని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.