తన చుట్టూ తిరిగాడు ప్రేమించనన్నాడు జీవితాంతం తోడుగా ఉంటాను అన్నాడు. పెళ్లయిన విషయాన్ని దాచి శారీరకంగా వాడుకొని ఏకాకిని చేసి పొమ్మన్నాడు తనకు రాజకీయ నాయకుడు అండదండలు ఉన్నాయని తనను ఎవరూ ఎం చేయలేదని బెదిరించాడు ఎవరు లేని తనకు పోలీసులు న్యాయం చేయాలని ఆ యువతి పోలిస్ స్టేషన్ ను ఆశ్రయించింది.

వివరాలు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి బాధితురాలు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి దాదాపు 11 సంవత్సరాలుగా సదాశివపేటలో నివాసం ఏర్పరుచుకుని పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఒక క్లినిక్ నడుపుతోంది. అయితే అదే ప్రాంతంలో ఉన్న 1 వ నెంబర్ వార్డ్ కు చెందిన మాజీ కౌన్సిలర్ అరుణ్ కుమార్ బాధితురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం బయట చెప్పకుండా 4 సంవత్సరాలుగా కలిసి సహజీవనం చేశాడు.

బాధితరాలిని శారీరక సుఖానికి వాడుకోవడమే కాదు. దాదాపు 20 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంది. అయితే తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని విషయం తెలుసుకుని అరుణ్‌ని బాధితురాలు నిలదీయగా తాను స్థానిక MLA అనుచరుడిని అని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.