కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత కొద్ది రోజుల క్రిందట తన భార్యతో కలిసి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరి నిర్ణయంతో ధనుష్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వీరి వివాహం అయ్యి 18ఏళ్లు కలిసి జీవించి, ఇద్దరు పిల్లలకు పేరేంట్స్ గా ఉండి విడాకులు తీసుకుంటున్నందుకు సినీ ఇండస్ట్రీతో పాటు వారి బంధువులు కూడా ఎంతగానో బాధపడ్డారు. ముఖ్యంగా రజనీకాంత్ తన కూతురు, అల్లుడు తీసుకున్న నిర్ణయం పూర్తి అసహనంగా ఉన్నారనే విషయం ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా తెలిపారు. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్స్ లో కూడా పేర్లు మార్చుకుని వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తీసేశారు. అయితే రీసెంట్ గా ధనుష్ పిల్లల స్కూల్ లో జరిగిన ఫంక్షన్ లో అటెండ్ అయిన వీరి జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఉంటే బావుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేశారు. రీసెంట్ గా వీరి విడాకులకు సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. కూతురు, అల్లుడ్ని కలిపేందుకు తన వంతు ప్రయత్నాలు చేసి రజనీకాంత్ సక్సెస్ అయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న సమస్యను రజనీకాంత్ దగ్గరుండి సాల్వ్ చేశారట. ఆయన చెప్పిన ఒక్క మాటకు ఎంతగానో కట్టుబడి ధనుష్, ఐశ్వర్యలు విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో రజనీకాంత్ ను ఆయన అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రజనీకాంత్ నిజంగా తోపు అంటూ, ఆయన చెప్పిన ఒక్కమాటతో కూతుర్నీ అల్లుడ్ని కలిపేశాడని కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ అభిమానులతో పాటు ధనుష్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏది ఏమైనా ధనుష్, ఐశ్వర్యలు విడాకులు విరమించుకోవడం మంచి విషయం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.