రహదారుల పరిశుభ్రత పరిష్టంగా నిర్వహించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. స్వీపింగ్ మిషన్ల ద్వారా జరుగుతున్న శుభ్రతను మేయర్ సోమవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించారు. వరంగల్ – హైద్రాబాద్ ప్రధాన రహాదారి రాంపూర్ వద్ద, నక్కలగుట్ట ప్రధాన రహదారి, బాలసముద్రం రోడ్ స్విపింగ్ మిషన్ల ద్వారా చేస్తున్న శుభ్రత తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ: నగర పరిశుభ్రతకు పెద్దపీఠ వేస్తూ 66 డివిజన్ లలో రోడ్లను శుభ్రపరచడానికి ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇందుకోసం 8 పెద్ద స్వీపింగ్ యంత్రాలను, 4 చిన్న స్వీపింగ్ యంత్రాలను వినియోగించి నగరం లోని ప్రధాన, అంతర్గత రోడ్లను ప్రతిరోజు ఊడుస్తున్నట్లు తెలిపారు. నగరవ్యాప్తంగా సానిటేషన్ మెరుగు పరచడానికి మరిన్ని స్వీపింగ్ యంత్రాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.