మంచిర్యాల జిల్లా మందమర్రిలో గూగుల్ పే ద్వారా ఆన్లైన్లో నగదు లావాదేవీలు జరుపుకుంటూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక చోట గుమిగూడి రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. గూగుల్ పే ద్వారా ఆన్లైన్లో నగదు లావాదేవీలు జరుపుతున్న 03మొబైల్ ఫోన్లు, 05గురు నిందితులు, 600/- రూపాయల నగదు స్వాధీనం.

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. సత్యనారాయణ IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్, సిబ్బంది మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మూడవ జోన్ ప్రశాంత్ నగర్ లోని ఒక ఇంటిలో రహస్యంగా గూగుల్ పే ద్వారా ఆన్లైన్ లో నగదు లావాదేవీలు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న

  1. అహ్మద్ పాషా s/o రషీద్ ,40yrs, మందమర్రి.
  2. అహమద్ పాష s/o నజీర్ అహ్మద్, 42yrs, మూడవ జోన్ మందమర్రి.
  3. కుమ్మరి సమ్మయ్య s/o కొమురయ్య, 36yrs, ప్రాణహిత కాలనీ, మందమర్రి.
  4. తిప్పారపు శ్రీనివాస్ ,s/o. ఓదెలు, 41yrs, మూడవ జోన్ మందమర్రి.
  5. నక్క ప్రసాద్ s/o పేద్దులు, 32yrs, భీమిని , మంచిర్యాల.

అనే ఐదుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 6,00-/రూపాయల నగదు, ఆన్లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్న 03 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కొరకు మందమర్రి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ మాట్లాడుతూ: ప్రభుత్వం కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒకచోట గుమిగూడి గుంపులుగా ఉండరాదని, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలని,

నిత్యావసర సరుకులు నిత్యావసర వస్తువులు పంపిణీ జేస్తూ ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీసులు మరియు మీడియా వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తూ తగిన చర్యలు తీసుకున్నప్పటికీ, కొంత మంది జూదరులు ఇవన్నీ పెడచెవిన పెట్టి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని,ఇలాంటి వారి వివరాలు సేకరించి పక్కా సమాచారంతో వారిపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.