మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో అభిప్రాయబేధాలు ఒక్కసారిగా బయటకు రావడంలో ‘మా’ డైరీ అవిష్కరణ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. రాజశేఖర్‌ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ మధ్యలోనే వెళ్లిపోయాడు. మా అసోసియేషన్‌లో జరిగిన రచ్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

ఇదిలా ఉంటే: అదే కార్యక్రమంలో మా సభ్యుల్లో నిజాయితీ తగ్గిందని రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు అక్కడ గందరగోళానికి దారి తీయగా, రాజశేఖర్ విలన్ అయిపోయాడు కార్యక్రమంలో. దీంతో భార్య జీవిత వచ్చి రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ చెప్పుకొచ్చింది.

చిరంజీవి లాంటి వాళ్ల దగ్గర నుంచి మేం చాలా నేర్చుకున్నామంటూ చెప్పుకొచ్చింది. ‘మా’కు ఆయన ఎంతో చేసారంటూ చెప్పుకొచ్చింది జీవిత. దాంతో అక్కడున్న వాతావరణం కాస్త కూల్ అయింది. కానీ అది మాత్రం తాత్కాలికమే. అప్పటి వరకు వేదిక చాలా వేడిగా ఉండటంతో వచ్చి తన మాటలతో కాస్త వేడి తగ్గించింది జీవిత. అందరినీ క్షమాపణ కోరింది జీవిత. మెగాస్టార్ చిరంజీవికి కూడా జీవితా క్షమాపణలు చెప్పారు.