రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో దేదావత్ రెడ్యా నాయక్ రెడ్డి నాయక్ పెద్దపల్లి జిల్లా అను వ్యక్తి 30 ఏప్రిల్ 2021 రోజున, ఎనిమిది (08) సంవత్సరాల ఒక మైనర్ బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆమెని బిస్కట్ పాకెట్ ఇస్తానని ఆశ చూపి, ఊరి చివరనున్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆ మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. బాలిక ద్వారా ఆమె అమ్మమ్మ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసినారు, గోదావరిఖని ACP ఉమెందర్ విచారణ చేసినారు. తదుపరి ఇట్టి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు దేదావత్ రెడ్యా నాయక్, రెడ్డి నాయక్ పెద్దపల్లి జిల్లా అనబడు సెక్సువల్ అఫెండర్ పై రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి. సత్యనారాయణ IPS, DIG పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన పీ.డీ యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులను రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మి నారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ లు నిందితునికి అందజేసిన అనంతరం కరీంనగర్ జిల్లా జైలు నుండి హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించడమైనది.

ఈ సంధర్బంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి. సత్యనారాయణ IPS DIG మాట్లాడుతూ: మహిళల భద్రతే రామగుండం కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యం అని మహిళలు, యువతులు, చిన్నపిల్లల తో ప్రతి ఒక్కరు మర్యాదగా ప్రవర్తించాలని, వారిని గౌరవించాలని మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట మహిళలతో కూడా అలాగే మర్యాదగా మెదలాలి అని సూచించారు.మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినవారిని, వారిని మానసికంగా శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని, మహిళలపై నేరానికి పాల్పడే వారు ఏంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. నేరస్థుని పై పీడీ యాక్ట్ అమలు కు కృషి చేసిన ఏసీపీ ఉమెందర్ ని, సీఐ రామగుండం లక్ష్మి నారాయణని, ఎస్ఐ ఎన్టీపీసీ స్వరూప్ రాజ్ ని సీపీ అభినందించారు.