మండలంలోని పాలంపేటలో గల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయాన్ని మంగళవారం జర్మనీ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామప్ప శిల్పకళా సంపద అద్భుతం అన్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రామప్ప గైడ్ లు విజయ్, వెంకటేష్ లు రామప్ప శిల్పకళా గురించి వివరించారు.