పవర్ స్టార్ సినిమాతో పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, మరోసారి మెగా ఫ్యామిలీపై సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. అల్లు పేరుతో కొత్త సినిమా చేస్తున్నానని ప్రకటించారు వర్మ. తన సినిమాకి అల్లు అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందో చెబుతూ సినిమా కథ గురించి ఇలా వరుస ట్వీట్లు చేశారు
“అల్లు” అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు.

తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని “ఆహా” అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ “అల్లు” అంటూ ట్వీట్ చేశారు వర్మ.