కరోనాకి మందు కనుగొన్నట్లు రాందేవ్ బాబా కంపెనీ చేస్తున్న ప్రకటనలను నిలిపి వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనిల్ మరియు స్వసారి పేరుతో కరోనా మందును విడుదల చేస్తున్నట్లు రాందేవ్ బాబు ప్రకటించారు. తమ మందు నూటికి నూరు శాతం పని చేస్తుందని, మందును మార్కెట్ లోకి విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన చెప్పారు. ఆ కంపెనీ కొన్ని ప్రకటనలను కూడా రూపొందించింది. వాటిని వెంటనే నిలిపివేయాలని, మందులు విడుదల చేయమని ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా శాస్త్రీయమైన నివేదిక ఇవ్వకుండా వైద్యపరమైన నియమాలను ఉల్లంఘించి మార్కెట్లోకి మందును ఎలా విడుదల చేస్తారని నిలదీసింది. దీనికి సంబంధించిన డేటాను, క్లినికల్ ట్రయిల్స్ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కూడా ఈ మందుల విడుదలకు ఎలా ఇచ్చారో వివరాలు అందచేశాలని ఆదేశించింది.