చిరంజీవి , నాగార్జున ఇతర సినీరంగ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీపై బాలక్రిష్ణ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. కేసీఆర్ తో భేటీ తరువాత , మంత్రి తలసాని , చిరంజీవి ఇంటికివెళ్ళడం , అక్కడ మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టే అంశంపై చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో , చిరంజీవి, నాగార్జున , రాజమౌళి లాంటి వారున్నారు.

అయితే ఈ భేటీలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనం. వాళ్ళు ఏవైనా రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం కలిసారేమో అంటూ చిరంజీవి , నాగార్జునను , ఇతరులను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారని వార్తలొచ్చాయి తానూ సినిమా ఇండస్ట్రీ వాడినని , వాళ్ళు మర్చిపోయారేమో అని నొచ్చుకున్నారని తెలిసింది. దీంతో మంత్రి తలసానికూడా ఈ వ్యాఖ్యలు నిజమైతే మాట్లాడుతానని అన్నారు..