వాగుల్లో చిక్కుకున్న15 మంది భక్తుల్ని కాపాడి రియల్ హీరోలు అనిపించుకున్నారు ములుగు పోలీసులు. భారీ వర్షాలకు పసర – మేడారం ప్రాజెక్ట్ నగర్ దగ్గర వాగులు పొంగిపోర్లుతున్నాయి. అయితే మేడారం దర్శించుకొని తిరుగు ప్రయాణమైన 15 మంది భక్తులు అక్కడ చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు డీఎస్పీ, పసర సీఐ రిస్క్ టీమ్ ఆధ్వర్యంలో కాపాడారు. ఒక్కొక్కరిని వాగు దాటించారు. చిన్న పిల్లల్ని తమ భుజాలపై ఎత్తుకుని వాగు దాటించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వంతెనకు ఫీట్ దూరంలో నీరు ఉరవడిగా వెళుతోంది. అదంతా అటవీ ప్రాంతం కావడంతో బొరియల్లోని ఎలుకలన్నీ వరదకు కొట్టుకుపోతున్నాయి. కొన్ని తెలివిగా తుంగల మీదకు ఎక్కి ప్రాణాలు నిలుపుకున్నాయి, ఎవరైనా కాపాడుతారా అని జనంవైపు జాలిగా చూస్తున్నాయి. వరద ప్రవాహం వేగంగా ఉండటంతో వాటిని ఎలా ఒడ్డుకు చేర్చాలో తెలియక స్థానికులు సాహసం చేయడం లేదు. మూగప్రాణాల అవస్థ చూసి అక్కడున్నవాళ్లంతా అయ్యోపాపం అని ఆవేదన వ్యక్తం చేయడం తప్ప, ఏమీ చేయలేకపోయారు…