{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584278992463","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584278951035","source":"other","origin":"unknown"}

సాధారణంగా హిజ్రాలు రైల్లలో, నగరాల్లో జరిగే వివాహాలకు, శుభకార్యాలకు, వ్యాపారసంస్ధల ప్రారంభోత్సవాలకు వచ్చి డబ్బులను డిమాండ్ చేస్తారు. ఒక వేళ ఇవ్వకపోతే అక్కడ గొడవ గొడవ చేస్తారు. ఇచ్చే దాక అక్కడి నుంచి ఒక పట్టాణ కదలరు. దాంతో తప్పిన పరిస్థితుల్లో యజమానులు డబ్బులు ఇచ్చి వారిని సాగనంపుతారు. ఇదే పరిస్థితి ఓ అదనపు కలెక్టర్ కు కూడా ఎదురైంది. డబ్బులు ఇచ్చేదాక వదలమని కలెక్టర్ ముందు భీశ్మించుకు కూర్చున్నారు హిజ్రాలు. హిజ్రాల సెగ కేవలం సామాన్యపౌరులకే అదనపు కలెక్టర్లకు కూడా తప్పడం లేదు.

పూర్తివివరాల్లోకెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ఇటీవలే బదీపై వచ్చారు. ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరీశీలించడానికి ఆదివారం ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిజ్రాలు కలెక్టర్ ఉన్న ప్రాంతానికి వచ్చారు. తమకు డబ్బులు కావాలని డిమాండ్ చేసారు. వెంటనే కలెక్టర్ తన పర్సులో ఉన్న కొంత మొత్తాన్ని వారికి ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని హిజ్రాలు తమకు రూ.5116 ఇవ్వాలని డిమాండ్ చేసారు. కలెక్టర్ ని బయటికి రానివ్వకుండా అక్కడే నిలుచుండిపోయారు.

దీంతో ఇతర అధికారులు వారిని ఆగ్రహించారు. అయినప్పటికీ వారు అక్కడినుంచి డబ్బులిస్తేనే కానీ కదలమని ససేమిరా అన్నారు. ఎంత చెప్పినా వాళ్లు వినకపోవడంతో అధికారుల ఓపిక నశించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కొంత అలస్యంగానైనా అక్కడికి చేరుకన్నారు. ఆ తరువాత పోలీసులు హిజ్రాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసారు. ఏదో ఒక లాగ వారిని అక్కడి నుంచి పంపించారు. అప్పటివరకూ అదనపు కలెక్టర్ వేచి వుండి వాల్లు వెల్లిన తరువాత ఇళ్ళ నిర్మాణాలను పూర్తిగా పరిశీలించారు. హిజ్రాలు వెళ్లినట్లు అధికారులు తెలపడంతో అదనపు కలెక్టర్ అంజయ్య డబుల్ ఇళ్ళ నుంచి వెళ్లి పోయారు.