తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా దాదాపు రేవంత్ రెడ్డి ఖరారైన నేపథ్యంలో మొదటి దెబ్బనే చాలా పెద్దగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికలే ప్రధాన ధ్యేయంగా ఇప్పటికే హన్మకొండ, వరంగల్ పలు డివిజన్లలో రేవంత్ ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగిన సంగతి తెల్సిందే. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు నియోజకవర్గాల నుండి ఇద్దరు అభ్యర్థులు వేల సంఖ్యలో, గ్రేటర్ వరంగల్ లో ముగ్గురు సిట్టింగ్ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన మొదటి రోజే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక రేవంత్ రెడ్డి కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యువతను, సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు రేవంత్ అనుచరులు చెపుతున్నారు.