వ్యవసాయం అంటే దండగ కాదు పండగ చేయాలని, రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ నిత్యం ఆలోచిస్తున్నారని గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, గౌరారం గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాతూ రాష్ట్ర ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోహిణి రాగానే నార్లు పోసుకుంటాం.

అయితే ఒకప్పుడు కరెంట్ కష్టాలతో పంటలు సరిగా పండకపోయేది. నేడు సీఎం కేసీఆర్ వల్ల ఇప్పుడు కరెంట్ పోవడమనేదే లేదు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ద్వారా పెట్టుబడి, నీటి తీరువా రద్దు చేసి పుష్కలమైన నీరు అందిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ కొంతమందికి రైతు బంధు రావడం లేదన్నారు.

రైతు బంధు రానివారందరికి వచ్చేలా చూడాలని కలెక్టర్ కు సూచించారు. సీతారామ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకొచ్చి బయ్యారం చెరువును నింపాలని సీఎం కేసీఆర్ ని కోరానని, ఒక టీఎంసీ నీటి సామర్ధ్యం తో ఈ చెరువు సామర్ధ్య పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వం సూచించిన పంటలు ఈ వానాకాలంలో వేసి రైతులు సంతోషంగా ఉండాలన్నారు. సీతారామా ప్రాజెక్టు ను బయ్యారం వరకు తెచ్చి నీళ్ళు అందిస్తాం. కావున అధికారులు సూచించిన పంటలే వేయాలని రైతులను కోరారు.