మేడ్చల్‌: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి అధికారులకు సూచించారు. మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలక్ట్రానికి వెయింగ్‌ మిషన్లు, గన్నీ సంచులు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. మేడ్చల్ జిల్లాలోనే పెద్ద కొనుగోలు కేంద్రంమైన ఏదులాబాద్లో ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ సూచించారు. రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఆమె చెప్పారు. గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది చేపడుతున్న ఇంటింటి ఫీవర్ సర్వేను తనిఖీ చేశారు. సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి శ్వేతమహంతి వైద్య సిబ్బందికి సూచించారు.