మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం పత్రిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనుల్లో, జాప్యం చేయొద్దని మేడ్చల్ ఇంచార్జి కలెక్టర్ శ్వేతామొహంతి అధికారులను ఆదేశించారు. శనివారం మేడ్చల్ మండలంలోని పూడూరులో నిర్మిస్తున్న రైతు వేదికను ఆమె పరిశీలించారు. రైతు వేదిక పనులను సాధ్యమైనంత త్వరగా, నాణ్యతగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. రైతు వేదిక వద్దకు రాకపోవడంపై ఆర్అండ్బీ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు వేదిక నిర్మాణానికి నిధులు సరిపోకపోతే, పంచాయతీ నుంచి రూ._3 లక్షలు ఇచ్చామని సర్పంచ్ బాబుయాదవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గ్రామ పరిధిలో చేపట్టిన హరితహారాన్ని పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యకమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, ఎంపీటీసీ రఘు, ఆర్ఐ సుస్మిత తదితరులు పాల్గొన్నారు.