రైలు ప్రమాద బాధితుడికి ఎంజీఎం వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స ఎంజీఎం

రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తికి వరంగల్ ఎంజీఎం వైద్యులు 5 గంటల పాటు శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సునిల్‌కుమార్ గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌లోంచి జారిపడ్డాడు. ప్రమాదంలో సునిల్‌కుమార్ పొట్టలో తీవ్ర గాయమై పేగులు బయటపడ్డాయి. అయినా అతను ధైర్యంతో పేగులను అదిమిపట్టుకుని నడుచుకుంటూ హసన్‌పర్తి సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ స్టేషన్ మాస్టర్ సునిల్‌ను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ల్యాపరోస్కోపిక్ సర్జన్ కూరపాటి రమేశ్ తన బృందం సాయంతో సోమవారం 5 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి, ప్రాణాలు కాపాడారు…