విశాఖ దురంతో ట్రైన్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని పురుడు పోసి అందరి మన్ననలు పొందింది. శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకాపల్లి సమీపంలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అదే భోగీ లో ప్రయాణిస్తున్న వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని ట్రైన్ లో డెలివరీ చేసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందంగా ఉందని, ఈ ప్రయాణంలో తమ తల్లి బిడ్డలను కాపాడిన ఆ విద్యార్థినిని అందరూ అభినందించారు.