అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘మనసా మనసా’ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో మన బ్యాచిలర్ అఖిల్ అక్కినేని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటుండగా.. అతని బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న పూజాహెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకిస్తూ కనిపించింది. దీంతో ఈ సినిమాలో యువతికి నచ్చే రొమాంటిక్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. అఖిల్ – పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరినట్లు అర్థం అవుతోంది. ఈ మూవీలో బొమ్మరిల్లు భాస్కర్ గత చిత్రాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం