రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆదివారం బీబీగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివదుర్గా రైస్‌ మిల్ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్.కె.జలీల్ (40) ముక్యానాయక్ తండా నుండి కేసు విచారణ నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా, సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్తున్న డిసిఎం బీబీగూడెం గ్రామ పరిధిలోని శివదుర్గా రైస్‌మిల్లు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో జలీల్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చివ్వెంల పోలీసు స్టేషన్‌లో గత ఐదు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. విషయం తెలసుకొన్న చివ్వెంల ఎస్‌ఐ లవకుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకొని జలీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు.