గురువారం సాయంత్రం జ‌రిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ రావు విధులు ముగించుకుని వెళుతున్న స‌మ‌యంలో ఆ ప్రయాణిస్తున్న కారును ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో శ్రీనివాస్ రావు మృతి చెందగా, ఇందులో ప్ర‌యాణిస్తున్న‌ మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీనివాస్ రావు మృతి వార్త తెలుసుకున్న ప‌లువురు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని చేరుకున్నారు. మ‌రోవైపు ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది..

ములుగు డీపీఆర్ఓ శ్రీనివాస్ రావు మృతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు…