కన్నడ టీవీ నటి శోభ, మరో నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చిత్రదుర్గ శివారులో బుధవారం(జులై 17) ఈ ఘటన చోటు చేసుకుంది. 4వ నెంబర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక మల్టీ పర్సస్ వెహికిల్‌లో శోభతో పాటు మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. చిత్రదుర్గ శివారులోని కుంచినగనలు వద్ద జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా…. ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.