{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581579982499","total_editor_time":105,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581579982458","total_effects_time":0,"brushes_used":0,"height":739,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

తల్లీబిడ్డా ఆరోగ్యం బాగుంది మూడు రోజుల్లో ప్రసవం చేద్దాం వెళ్లి రండి’’ అని డాక్టర్‌ చెప్పిన ఆ మాటలతో మనసు నిండా సంతోషం నింపుకుని దంపతులిద్దరూ ఇంటికి బయలుదేరారు. తమ ప్రతిరూపాన్ని కళ్లారాచూసుకునే అద్భుత ఘడియలకు మరికొంత సమయమే మిగిలి ఉందనుకుంటూ కాబోయే తల్లిదండ్రులు బైక్‌పై ప్రయాణం సాగిస్తున్నారు. క్షణం ఒకే క్షణంలో దూసుకొచ్చిన లారీ ఛిద్రం చేసేసింది, ఆ తల్లి కలల్నీ ఆమె దేహాన్నీ, బిడ్డ ప్రాణాల్ని కూడా పెనుబల్లి మండలంలో జరిగిన ఈ దారుణం ప్రతిఒక్కరి కంటా కన్నీరు పెట్టించింది.

వివరాలు.. రామచంద్రారావు బంజర గ్రామానికి చెందిన బలుసుపాటి మురళి, తొమ్మిది నెలల గర్భవతి అయిన తన భార్య కల్యాణి(20)ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం బైక్‌పై తీసుకెళ్లాడు. మూడురోజుల్లో కాన్పు అవుతుందని వైద్యులు చెప్పారు. అనంతరం మోటారుసైకిల్‌పై తిరుగు పయనమయ్యాడు. ఈ సమయంలో గ్రామ సమీపంలోని సబ్‌స్టేషన్‌ వద్దకు రాగానే వరుసగా లారీలు వేగంగా దూసుకొచ్చాయి. దీంతో బైక్‌ను రోడ్డు దించి, మళ్లీ రోడ్డు ఎక్కించే ప్రయత్నంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కిందపడిన కల్యాణిపై నుంచి లారీ వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది..

కడుపులో ఉన్న తొమ్మిది నెలల శిశువు రోడ్డుపక్కన పదిమీటర్ల దూరంలో పడిపోయింది. మురళీ రోడ్డుపక్కన పడ్డాడు. కల్యాణి మృతదేహం చిందరవందరగా మారి సంఘటనా స్థలం హృదయవిదారకంగా తయారైంది. ప్రమాద విషయం గమనించిన స్థానికులు, శిశువును ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందింది. కల్యాణి ఆమె మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. సత్తుపల్లి రూరల్‌ సీఐ తాటిపాముల కరుణాకర్‌, వీఎంబంజర్‌ ఎస్‌ఐ నాగరాజు సంఘటనాస్థలానికి చేరుకొని లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.