రోడ్డు ప్రమాదంలో మరణించిన కాజీపేట రహమత్ నగర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ కుటుంబ మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించి, మృతుల కుటుంబాలను ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, డా.రాజయ్య, కూడా ఛైర్మెన్ యాదవ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా అమనగల్ పట్టణ సమీపంలో కల్వకుర్తి – హైదరాబాద్ ప్రధాన రహాదారి మేడిగడ్డ వద్ద రెండు రోజుల క్రితం శ్రీశైలం దైవదర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ దుర్గప్రసాద్ కుటుంబం మృతి చెందింది.. నేడు కాజిపేటలోని వారి నివాసంలో ఉంచిన పార్థీవ దేహాలకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఈ సందర్బంగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు..రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా ప్రాణాలు కోల్పోవడం బాదాకరమని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.