రోడ్డు ప్రమాదంలో నవవరుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రొంపి చెర్ల మండలం చెంచమరెడ్డిగారిపల్లె సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నవవధువు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: లక్ష్మి నగర్‌కు చెందిన చాంద్‌బాషా(28) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో పని చేస్తున్నాడు. రొంపిచెర్లలో షామీర్ ఖాన్ కూతురు సోనియాతో చాంద్ బాషాకు వివాహం జరిగింది.

పెళ్లి తరువాత ఐదో రోజు వేడుకలు శుక్రవారం సోనియా ఇంట్లో నిర్వహించడంతో వరుడు వధువుతో కలిసి బైక్‌పై అత్తారింటికి వెళ్తుండగా అతివేగంగా వచ్చిన టాటాఎస్ ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలిస్తుండగా చాంద్‌భాషా మృతి చెందగా సోనియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.