ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకుగా పోలీసు అధికారులు వ్యూహత్మకమైక చర్యలు తీసుకోవాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమీషనర్ అధ్వర్యంలో పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం భీమారంలోని శ్రీశుభం పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. డి.సి.పి, అదనపు డి.సి.పి, ఎ.సి.పి, ఇన్స్పె క్టర్లు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో ముందుగా ఈ సమావేశంలో ముందుగా ఇటీవల నిర్వహించిన లోక్అదాలత్ లో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ రెండ స్థానంలో నిలవడంపై పోలీస్ కమిషనర్ అధికారులను సిబ్బందిని అభినందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ల వారిగా పోలీస్ అధికారుల పనితీరుతో పాటు కేసుల నమోదు వాటి పరిష్కరణ, నిందితుల అరెస్టులు మరియు కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమీషనర్ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు.

ఇందులో ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారణపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో ఈ ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు, మద్యం సేవించి వాహనాదారులను నియంత్రించేందుకుగాను తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలుసూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన రోడ్డు మార్గాల్లో సూచిక బోర్డులతో పాటు, రోడ్డు మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టాడంతో పాటు స్థానిక అధికారులు క్షేత్ర స్థాయిలో రోడ్ల పరిశీలన నిర్వహించి ఎదైనా సమస్య వుంటే సంబంధిత అధికారుల దృష్టి తీసుకోవాల్సి వుంటుందని. గ్రామం నుండి హైవే రోడ్లను కలిపే రోడ్డు ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ
శాంతి భద్రతలకు అంశాలపై పోలీస్ కమిషనర్ ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో వివిధ సంఘటనల్లో నేరాలకు పాల్పడిన నేరస్థులకు కోర్టు జీవితకాలం జైలు శిక్షలు విధించడం ద్వారా పోలీసులపై నమ్మకం పెరిగిందని. ఇదే రీతిలో సాధరణ కేసుల్లోను నిందితులకు జైలు శిక్షలు పడేవిధంగా అధికారులు కృషి చేయడం ద్వారా నేరాలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం వుందని. నేరాల నియంత్రణ కోసం వరంగల్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భాగస్వాయ్యంతో పాటు నేను సైతంలో భాగం ముమ్మరం సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, మానవ హక్కుల కమిషన్ నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ ఇంచార్జ్ డి.సి.పిలు పుష్పా, వెంకటలక్ష్మీ ఎ.ఆర్ ఆదనపు డి.సి.పి గిరిరాజుతో పాటు ఎ.సి.పిలు, ఇన్ స్పెక్టర్లు, ఆర్.ఐలు, సబ్-ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.