ఆమె లంచాలకే మహారాణి.. ఫైలు కదలాలంటే కరెన్సీ కట్టలు చేతిలో పడాల్సిందే.. చిన్నా, చితకా మొత్తాలు ఈ అమ్మగారిగి అసలే ఆనవు, పేదవాళ్లం కాస్త.. కనికరించండి అని అడిగినా, ఒప్పుకోదు.. పదిమందిలో కాళ్ళ మీదపడి భోరున ఏడ్చినా ఆ బండరాయి అధికారి మనస్సు మాత్రం కరుగదు. ఇక్కడ ఫొటోలో మీకు కనిపిస్తున్న మహిళ గురించే ఇప్పటి వరకూ చెప్పిన ఉపోధ్గాతమంతా.. ఈమె పేరు లావణ్య..