ములుగు: జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సులో, మరో వంతెనను అధికరారులు నిర్మించనున్నారు. ఈ వంతెన రెండో ఐలాండ్ నుండి మూడో ఐలాండ్ వరకు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న లక్నవరం సరస్సు, మరిన్ని అందాలతో ఆకట్టుకోనుంది. మూడో వంతెనకు సుమారు రూ.కోటి 50 లక్షల వ్యయంతో 130 మీటర్ల పొడవు మూడున్నర ఫీట్ల వెడల్పు తో నిర్మించేందుకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ వంతెన నిర్మాణ పనులను శుక్రవారం నుండి ప్రారంభించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ సంబంధించిన మెటీరియల్ ను సైతం లక్నవరానికి చేర్చారు.

బొగత / లక్నవరం పర్యాటకులకు అనుమతి నిలిపివేత:

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం, జన సమ్మర్థం ఉన్న ప్రదేశాలు తాత్కాలికంగా బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని, డీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. ఇందులో భాగంగానే ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన బొగత వాటర్ ఫాల్స్, లక్నవరం పార్క్ వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతిని నిలిపివేశామన్నారు. ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజల సహకారం కూడా అవసరం అని ఆయన తెలిపారు.