మండలంలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరంను పర్యాటకులకు సందర్శించేందుకు మంగళవారం నుండి అనుమతిస్తున్నట్లు లక్నవరం యూనిట్ మేనేజర్ పుల్లారెడ్డి తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో వచ్చే భక్తులు లెఫ్ట్ అవ్వడం సందర్శనకు వస్తారని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో పది రోజులపాటు సందర్శనను నిలిపివేసినట్లు గుర్తు చేశారు. జాతర ముగిసినందున నేటి నుండి తిరిగి లక్నవరం సందర్శనకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.