ఈ లాక్ డౌన్ కాలంలో ధరలు పెంచకుండా వ్యాపారం చేయడం ప్రభుత్వం వల్లే కావడం లేదు. అందుకే లాక్ డౌన్ లో మద్యం ధరలను భారీగా పెంచి అమ్మకాలు జరుపుతున్నాయి. అలాంటిది తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కె కమలతాల్ అనే 85 ఏళ్ళ బామ్మ కేవలం రూ.1కే ఇడ్లిలను అమ్ముతూ వలస కార్మికులకు అండగా నిలుస్తున్నారు.

ఆమెకు వ్యాపారంలో నష్టం వచ్చినా ఇడ్లీల ధర పెంచక పోవడం గమనార్హం. ఆమెను చుట్టుపక్కల ఉన్నవాళ్లు ముద్దుగా ‘ఇడ్లీ బామ్మ’ అని పిలుచుకుంటారు. రోజు ఆ బామ్మ హోటల్లో తినే రూపాయి ఇడ్లితోనే అక్కడి ప్రజల రోజు మొదలవుతోంది. గత 30 ఏళ్లుగా ఆ బామ్మా రూపాయికి ఇడ్లి అమ్ముతోంది.