వంటలక్క..! తెలుగింటి గృహిణిలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. కార్తీక దీపం సీరియల్ ద్వారా అందరికీ ఇంటి మనిషి అయిపోయింది దీప.
ఐతే కరోనా లాక్‌డౌన్ వల్ల అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినిమాలు, సీరియళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. సినీ స్టార్లంతా ఇళ్లకే పరిమితమై కుటుంబంతోనే గడుపుతున్నారు. క్వారంటైన్‌లో సినిమాలు చూస్తూ, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

అదే తరహాలో కార్తీక దీపం కూడా నిలిచిపోవడంతో.. ప్రేమి విశ్వనాథ్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. క్వారంటైన్‌లో తాను కూడా ఇంటి పనులు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఐతే టిక్ టాక్‌లో గురువారం ప్రేమి విశ్వనాథ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇంటి ముందు కారును శుభ్రంచేస్తూ క్లీనర్‌గా మారిపోయింది వంటలక్క. డస్టర్‌ను నీటిలో ముంచి, కారు బ్యానెట్‌ను తుడుస్తూ వీడియోలో కనిపించింది. ఆ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ మాదిరే, నిజ జీవితంలోనూ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయక్కా, అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మాయదారి కరోనా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందంటూ, ఫన్నీగా స్పందిస్తున్నారు.