అది ఒడిశాలో ఓ పల్లెటూరు. ఆ అమ్మాయికి సిటీలో ఉద్యోగం చెయ్యడం అంటే ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న మేనత్త, నువ్విలా పల్లెటూరిలో ఉంటే ఉద్యోగం ఎవరిస్తారు. సిటీకి రా. నీకు ఉద్యోగం దొరికేలా నేను చేస్తా” అంది. సరే అన్న ఆ యువతి, రాజధాని భువనేశ్వర్‌కి వెళ్లింది. మేనత్త ఇంట్లో లగేజీతో దిగింది. ఐత, మేనత్త ద్వారా ఓ యువకుడు ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్లాల్సి ఉందన్నాడు. ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి, అక్కడ హోటల్‌లో బస చెయ్యాల్సి ఉంటుందని చెప్పాడు. ఆమె సందేహించగా,మేనత్త ఎందుకు టెన్షన్ పడుతున్నావు. ఉద్యోగం వస్తుందిలే అని అతనితో పంపింది. ఆమెను ఓ హోటల్ గదిలో దింపాడు. రెండ్రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుంది. బాగా ప్రివేర్ అవ్వు అని చెప్పాడు. సరే అంది. అతను వెళ్లిపోయాడు.

అదే రోజు రాత్రి ఆ హోటల్ గదికి అతనితో పాటూ, మరికొందరు వచ్చారు. డోర్ కొట్టారు. అతని మాట విని డోర్ తీసింది. ఏంటి అంటే ? వీళ్లే నిన్ను ఇంటర్వ్యూ చెయ్యబోయేది అంటూ వాళ్లను గదిలోకి రానిచ్చాడు. అందరూ లోపలికి వచ్చాక గది తలుపు మూసేశారు. ఆమె నోరు నొక్కి, గ్యాంగ్ రేప్ చేశారు. నిస్సహాయురాలైన ఆ యువతి వాళ్ల నుంచి తప్పించుకోలేకపోయింది. దారుణం తర్వాత వాళ్లంతా పారిపోయారు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దాంతో యువతి ఆ హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. జరిగిందేదో జరిగిపోయిందంటూ నాటకాలాడిన అతను మళ్లీ వచ్చి, ఆమెను హోటల్ గదిలోనే ఉండమన్నాడు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు డబ్బులు చెల్లిస్తానన్నాడు. ఆమె దగ్గర మొబైల్ ఆల్రెడీ లాగేసుకున్నాడు. అక్కడ ఉన్నవారంతా తన తాలూకేనని చెప్పాడు. ఎవరికైనా విషయం చెబితే వాళ్లూ వచ్చి రేప్ చేస్తారని బెదిరించాడు. ఆమెకు ఏం చెయ్యాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఆమె నిస్సహాయ స్థితిని క్యాష్ చేసుకొని రెండు నెలలుగా అత్యాచారం చేస్తూనే ఉన్నారు.

తాజాగా 4రోజుల కిందట ఆ మేనత్త హోటల్ గదికి వచ్చింది. యువతి తిరగబడేసరికి ఆమెను కిటికీ లోంచీ కిందకు తోసేసింది. గాయాలపాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ యువతి తన తల్లిదండ్రులకు కాల్ చేసి జరిగింది చెప్పింది. తాను కటక్ ఆస్పత్రిలో ఉన్నానని వివరించింది. ఫోన్లోనే ఏడ్చేసిన తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి అక్కడ కూడా కూతుర్ని చూసి కన్నీటి సంద్రమయ్యారు. ఈ దారుణం ఇప్పుడు ఒడిశాలో సంచలనం అయ్యింది. సామాజిక కార్యకర్త రీనా రౌత్రాయ్ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరపాలని చెప్పింది. పోలీసులు కేసు రాసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఉద్యోగం కోసం వెళ్లి మేనత్త నిజస్వరూపాన్ని గమనించలేకపోయిన ఆ యువతి చిక్కుల్లో పడింది.