లాక్ డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు అధికారులు. భక్తుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ దగ్గర ఇలా స్టిక్కర్లు అంటించారు. భక్తుల దర్శనాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోయినా.. ముందస్తుగా టీటీడీ అధికారులు ఇలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.