ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. కరోనా వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌనను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మెదక్ జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరిస్తుండడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి నియంత్రణకై ఈ నెల 31వ తారీఖు వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.

ఈ లాక్ డౌన్ ఉత్తర్వుల అమలు తీరుపై మెదక్ జిల్లా ఎస్.పి. గారు ఓ ప్రకటన చేస్తూ ఈ కరోనా వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను అనసరించి ప్రజా రవాణా వాహనాలు అనగా ఆర్టీసీ, ప్రవైయిట్ బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాలాంటి వాహనాల రాకపోకలను పూర్తి నిషేదించడం జరిగింది. అదే విధంగా నిత్యవసర వస్తువులను తరలించే వాహనాలకు ఈ నిబంధన వర్తించదని. అదే విధంగా మెడికల్, కిరాణం, పండ్లు కూరగాయలు, పాలకేంద్రాలు మినహయించి మిగితా అన్నిరకాల వ్యాపార సంస్థలు, వ్యాపార సముదాలు, మల్టీప్లెక్సులు విధిగా మూసివేయాలి. ముఖ్యంగా ఈ నెల 31వ తారీఖు వరకు సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలులో వుంటుందని.

ఈ సమయంలో ప్రజలు రోడ్లపైకి రావడంతో పాటు, మెడికల్ దుకాణాలు తప్ప మిగితా అన్నిరకాల షాపులను తెరవడంపై పూర్తి నిషేదించడం జరిగిందని. ఈ సమయాన్ని దృష్టిలో వుంచుకోని ప్రజలు వారి వారి ఇండ్లకు పరిమితం కావల్సి వుంటుందని హెచ్చరించారు. ప్రజలు తప్పకుండా లాక్ డౌన్ పాటించాలనీ, ఎవరైనా నిబంధనలు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాహనాలను అనుమతించబోమని హెచ్చరించారు. అలాగే కాదని ఎవరైనా వాహనాలతో రోడ్లపైకి వస్తే సరైన ఆధారాలు చూపకపోతే అట్టి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన 36 ఆటోలను, 35 ద్వీచక్రవాహనాలను, 1 కారు, 1 లారీలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

ఇక ఉదయం 6గంటల నుండి సాయంత్రం 7 గంటల సమయంలో ప్రజలు కేవలం తమ నిత్యవసర వస్తువులు, మందులను తమ సమీప దుకాణాల్లో కొనుగోలు చేసి తిరిగి తమ ఇండ్లకు చేరుకోవాల్సి వుంటుందని, వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వ్యక్తుల మధ్య దూరం వుందే విధంగా తగు జాగ్రత్తలను పాటిస్తూ కోనుగోళ్ళు చేయాల్సి వుండడంతో పాటు, రోడ్లపై ఐదుగురి మించి గుంపులు, గుంపులుగా వుండటాన్ని నిషేదించడం జరిగిందని, పగటి వేళల్లో అత్యసరంగా బయటికి వెళ్లానుకున్నవారు ద్వీచక్రవాహనంపై ఒకరు, కారులో అయితే ఇద్దరు వ్యక్తులే ప్రయాణించాలని గారు తెలిపారు.

హోం క్యారంటైన్ వున్న వ్యక్తులపై పోలీస్ నిఘా వుంటుంది.
కరోనా వ్యాధి దృష్యా మెదక్ జిల్లా పరిధిలో విదేశాల నుండి వచ్చిన వ్యక్తులను గుర్తించి వారిని హోం క్యారంటైన్లో వుంచడం జరుగుతుందని. ఈ విధంగా నిర్భందం వున్న వ్యక్తులను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది దఫా,దఫాలుగా హోం క్యారంటైన్లో వున్న వ్యక్తుల వద్దకు సందర్శించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే జిల్లా క్యారంటైన్ హోంకు తరలించడంతో పాటు చట్టపరమైన తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్.పి.గారు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే ఇక జైలుకే:

కరోనా వ్యాధికి సంబంధించి వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని. వాట్సప్ లలో ఫేక్ న్యూస్ లను పెట్టవద్దని ఒకవేళ ఫేక్ న్యూస్ లు పెడితే మెదక్ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 7330671900కి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, లేదా డయల్ 100 కి సమాచారం అందజేయాలని సూచించారు. ఇప్పటికే వాట్సప్ నందు కరోనా సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినందుకుగాను మెదక్ జిల్లాలో మెదక్ టౌన్ మరియు చేగుట పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు కావడంతో పాటు పోస్టు చేసిన వారిని అరెస్టు చేయడం జరిగిందని. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని జిల్లా ఎస్.పి. గారు హెచ్చరించారు.