దేశమంటే మట్టి కాదోయ్.! దేశం అంటే మనుషులోయ్..! లాక్ డౌన్ మొదలైన రోజు నుండి నేటి వరకు ప్రజలకు అందుబాటు లో ఉండి, రోజు ఎదో ఒక సేవ కార్యక్రమాలతో తనదైన శైలిలో ముందుకు సాగుతూ, ఇతరులకి స్ఫూర్తినిస్తున్న మన వరంగల్ 30వ డివిజన్ కార్పొరేటర్ బొడా డిన్న గారు.

లాక్-డౌన్ ప్రకటించిన రోజు నుండి 30వ డివిజన్ లో పర్యటన చేసి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 15 రోజులకు సరిపడా కిరాణా సరుకులను పేద ప్రజలకు పంపిణి చేసారు, అలానే. కుల వృత్తుల వారు, అర్చక బ్రాహ్మణులు, ఆటో వారు, పెంటర్స్ ఇలా ఎవరైతే ఈ లాక్-డౌన్ వలన కష్ట కాలంలో ఉన్నారో వారందరికి తన చేతనైనంత సహాయం చేసారు. అంతే కాకుండా వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి గారిని కలసి తన రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రతి రోజు డివిజన్ లో పారిశుధ్య కార్మికులతో కలిసి తిరుగుతూ తన డివిజన్ లోగల కాలనీలను పరిశుబ్రాంగా ఉండేలా చేసిన పారిశుధ్య కార్మికులతో కలసి భోజనం చేసి వారందరికీ సాత్యవసర సరుకులు పంపిణీచేసి కార్మికులందరూ తన కుటుంబ సభ్యులు అని తెలిపారు …

పోలీసులు, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు పూలతో సన్మానం:

వరంగల్ అర్బన్ జిల్లా కార్పొరేటర్ డిన్న గారి ఆధ్వర్యంలో {కరోనా వారియర్స్} పోలీసులకి, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకి పూలతో వారికి పాదాభివందనం చేసి వారిని సత్కరించారు, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మొదటిసారిగా నిర్వహించి ఇతరులకి స్ఫూర్తినివ్వడం విశేషం.

కార్పొరేటర్ గారు మీ లక్ష్యం ఏంటి అని మా హమారా వరంగల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.:?
” సర్వే జన సుఖినో భవంతు ” సీఎం కేసీఆర్, యువ నాయకుడు కేటీఆర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గార్ల బాటలో నడిచి ప్రజలకి అందుబాటులో ఉండి, వారి సంక్షేమమే తన జీవిత పరమార్థం అని చెప్పారు…