chandana deepti ips
{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1598273088710","source":"share_action_sheet","origin":"gallery","sources":["290279836040211","326606682052211"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1598888332040"}

కరోనా వైరస్ నివారణ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు( తేది 12.05.2021 నుండి 22.05.2021 వరకు) రోజు ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధించడం జరిగింది. రోజు ఉదయం 10 గంటల నుండి లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. అందుకుగాను మెడికల్ ఎమర్జెన్సీ లేదా మరేదైనా అత్యవసర సమయంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేయడం జరుగుతుంది, అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐ. పి.ఎస్ గారు జిల్లా ప్రజలకు సూచించారు. online లో htpps://policeportal.tspolice.gov.in అనే లింక్ ద్వారా interstate/inter district movement pass(Vehicle/individual)2021 కు ధరఖాస్తు దారుడు తనయొక్క వివరాలు, పాస్ ఎందుకు అవసరం ? జిల్లా లో మీరు ఉండే ప్రాంతం నుండి ఎక్కడవరకు ఏ మార్గం లో (గమ్యస్థానం), ఎన్ని రోజులకు అవసరం, వ్యక్తిగత పాస లేక వాహన పాసా వంటి వివరములు, application లో నమోదు చేయవలెను, వాటికి సంబందించిన డాక్యుమెంట్స్ కూడా upload చేసి acknowledgement తీసుకొని దాని reference నెంబర్ నోట్ చేసుకోవలెను . E -pass కొరకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల యొక్క application లు పరిశీలించి వారికి online లోనే E-PASS లు అందించటం జరుగుతుంది అని అన్నారు.

అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి మాత్రమే పాస్ లను జారీ చేస్తారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్ లు జారీ చేస్తారని అన్నారు.

👉లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.

👉రాష్ట్రంలోని ఎక్కడినుండైనా పేర్కొన్న వెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకై దరకాస్తు చేసుకోవాలని ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పాసులు జారీ చేస్తామని తెలిపారు.

👉జారీ చేసిన పాసులను ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని సంబంధిత వాహనాలకు ముందు అద్దం ఎడమవైపు అతికించుకోవాలని సూచించారు.

👉పాసుల గురించి ఎవరు కూడా జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దని సూచించారు.

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:


జిల్లా పరిధిలో లాక్ డౌన్ ను అమలు పరిచేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందిని ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని షాప్స్ తెరచి ఉంచబడుతాయని తరువాత లాక్ డౌన్ ను ప్రతి రోజు 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 06 గంటల వరకు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలియజేశారు. ఈ లాక్ డౌన్ సమయం లో ప్రజలు ఎవరు కూడా బయట తిరగరాదని. ఎవరైనా బయట తిరిగిన, కనబడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. వారి పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడుతాయని అన్నారు. వ్యవసాయానికి సంబందించిన సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, గూడ్స్, ట్రాన్స్ పోటేషన్ సర్వీసెస్ , మీడియా మొదలగు వాటికి మినహాయింపులు ఉన్నదని. వీరు సరైన గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ను పాటించి పోలీస్ వారికి సహకరించాల్సిందిగా జిల్లా ప్రజలను ఎస్పీ గారు కోరారు.