కరోనా భయం పక్కకుపెట్టి సుల్తాన్ బజార్ లోని ఓ ప్రైవేట్ లాడ్జీలో జరుగుతున్న వ్యవహారం వెలుగుచూసింది. యువతులతో పాటు వారితో ఉన్న ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన రఫీక్‌ అనే వ్యక్తి ఈ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. కోఠిలోని పూత్లిబౌలి చౌరస్తా వద్ద ఆదిలాబాద్‌ లాడ్జీ పేరుతో కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని సీఐ సుబ్బిరామిరెడ్డి వెల్లడించాడు. సుల్తాన్‌బజార్ ఎస్సై లింగారెడ్డి సిబ్బందితో కలిసి లాడ్జీపై దాడి చేసి యువతులు, ఇద్దరు విటులతోపాటు లాడ్జీ సూపర్ వైజర్ రవిని అరెస్టు చేశారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..