కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసి చివరి నిమిషంలో తప్పుకున్న ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొచ్చిలోని ఎడప్పల్లి ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం(జులై 20) సాయంత్రం 6.30గంటలకు అనన్య ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించిన అనన్య ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.