జిల్లాలోని వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. చెరువులో యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులకు కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి వయసు 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. 5.1 అడుగుల ఎత్తు ఉన్న యువతి బూడిద రంగులో ఉన్న టాప్, తెలుపు రంగు ప్యాంట్ ధరించింది. ఆమె మెడలో ఎరుపు రంగు తాడు, కుడి చెంపపై పుట్టుమచ్చ, కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మలు, ముత్యంతో కూడిన ముక్కుపుల్ల ఉన్నాయి. ఇక బంగారు వర్ణంలో ఉన్న చెప్పులు.. చెరువు ఒడ్డుపై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాం కోసం కాజీపేట పోలీసులను సంప్రదించొచ్చు.