వధువుకు పాజిటివ్‌ రావడంతో జరగవలసిన వివాహం చివరిక్షణంలో ఆగిపోయింది. ఈనెల 1వ తేదీ జరగాల్సిన వివాహం కోసం 29వ తేదీన ఢిల్లీ నుంచి కోవై జిల్లా పొల్లాచ్చి సమీపంలో ఉన్న వడగపాళయం గ్రామానికి వధువు సహా ఐదుగురు వచ్చారు. వీరికి ఆరోగ్యశాఖ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారణ కావడంతో వివాహం ఆగిపోయింది.