ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలను గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్షించుకున్నారు. ముందుగా గిరిజనుల సాంప్రదాయం ప్రకారం బొట్టుపెట్టి, పూలదండ వేసి, డోలు, వాయిద్యాలతో మంత్రికి స్వాగతం పలికారు. సమ్మక్క, సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లను దర్షించుకొని మొక్కులు సర్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…మహిళలకు దసరా పండుగ పురస్కరించుకొని పంపిణీ చేసే చీరలను వన దేవతలకు బతుకమ్మ చీరలను సమర్పిoచానన్నారు. మంత్రి వెంట ఎంపీ కవిత, జెడ్పీ చైర్మన్ జగదీష్, మాజీమంత్రి చందూలాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ లు వున్నారు.