ఆమె వయసు ఆరేళ్లు డబ్బులు లెక్కపెట్టడం కూడా రాని వయసు. అయితేనేమి ప్రస్తుతం ఆ చిన్నారి సంపాదన నెలకు అక్షరాలా రూ. 21 లక్షలు. ఇది ఎలా సాధ్యం అంటారా. మనందరికీ తెలిసిన దారే అదే యూట్యూబ్ రివ్వూస్. దక్షిణ కొరియాకు చెందిన ఈ చిన్నారి మార్కెట్లో రిలీజయ్యే ఆట వస్తువులపై రివ్యూలు చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతుంది. ‘బోరమ్ టాయ్ రివ్యూస్’ ఛానెల్‌లో ఆమె రిలీజ్ చేసే రివ్యూలు దక్షిణ కొరియాలో బాగా పాపులర్. అభిమానులు ఆమెను బోరమ్ అని పిలుస్తుంటారు. దాదాపు 13 లక్షల మంది సబ్స్‌స్క్రైబర్లు ఆ చిన్నారి వీడియోల కోసం కళ్లలో ఒత్తులేనుకుని ఎదురుచూస్తుంటారు. తాజాగా తన యూట్యూబ్ సంపాదనతో ఆమె ఏకంగా 55 కోట్లు పెట్టి ఓ పెద్ద బంగళా కొనటం దక్షిణ కొరియాలో పెను సంచలనానికి దారితీసింది…