ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలను ప్రజలు నిర్బంధించుకోవడం శుభపరిణామమని అన్నారు. క్వారంటైన్‌లో ఉండని వారి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. భూపాలపల్లి జిల్లాలో 34 మంది అనుమానితులు ఉన్నారని, మహబూబాబాద్‌లో 101 మంది విదేశాల నుంచి వచ్చారు, కానీ ఎవరికీ పాజిటివ్ రాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

వరంగల్ కరోనా పై సమీక్ష:

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా వెద్యాధికారులు, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు, సీపీ రవీందర్‌తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై జిల్లాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఎర్రబెల్లి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.