వరంగల్‌లో పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకమని పోలీసు కమిషనర్‌ రవీంద ర్‌ అన్నారు. 30 ఏళ్లుగా పొలీస్‌శాఖలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన సీపీ డాక్టర్‌ విశ్వ నాథ రవీందర్‌, అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. వరంగల్‌ పొలీస్‌ కమిష నరేట్‌ అధికారుల ఆధ్వర్యంలో భీమారంలోని శ్రీశుభం కల్యాణ మండపంలో సీపీ, మల్లారెడ్డిని సన్మా నించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హన్మంతు, హరిత, ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ అక్బర్‌, జైళ్ల శాఖ డీఐజీ రాజేశ్‌కుమార్‌ హాజరై పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని, సమన్వయంతో జఠిలమైన సమస్యలను పరిష్కరించామన్నారు.

చిన్నారి శ్రీహిత హత్యకేసులో నింది తుడికి 50 రోజుల్లోనే మరణశిక్ష పడేలా చేయడం ఉద్యోగ ప్రస్థానంలో మరుపురాని విషయమన్నారు. అదేవిధంగా 9 హత్యల కేసును ఛేదించడం సంతృప్తినిచ్చిందన్నారు. వరంగల్‌ సీపీగా రాణించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సహకరించాయన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు గుర్తింపు లభిస్తుం దనడానికి నా జీవితం ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.