కరీమాబాద్ లో దారుణం చోటుచేసుకుంది 8 సంవత్సరాల చిన్నరిని ఆత్యాచారం చేయబోయున బాస్కర్ చిన్నరి కేకలు వేయడంతో చూట్టు పక్క ప్రజలు బాస్కర్ ని పట్టుకోని దోహశుద్ది చేసిన ప్రజలు…

వరంగల్‌లో ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడి యత్నం ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం వరంగల్‌లో ఓ ప్రాంతానికి చెందిన టీ భాస్కర్ (26) తన ఇంటి పక్కనున్న చిన్నారులతో చనువుగా ఉండేవాడు. ఆ ఎనిమిదేళ్ల బాలిక భాస్కర్‌ను బాబాయి అంటూ పిలుస్తూ సరదాగా ఉండేంది.

దసరా సెలవులు కావడంతో ఇంటి ముందు తోటి పిల్లలతో కలిసి ఆ డుకుంటున్నది. భాస్కర్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై నగర శివారులోని గుట్ట పక్కనున్న చెరువు వద్దకు తీసుకు వెళ్లాడు. చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి కేకలు పెట్టడంతో అటుగా వెళ్తున్న రైతు కూలీలు, స్థానికులు గమనించి అక్కడికి చేరు కుని యువకుడికి దేహశుద్ధి చేశారు. బాలిక చెప్పిన ఇంటి అడ్రస్‌కు బాలికను తీసుకొచ్చారు.

యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఎంజీఎం దవాఖానకు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.