వరంగల్ రూరల్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బావిలో దూకి చనిపోయారు. గీసుకొండ మండల గొర్రెకుంటలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో నలుగురు వలస కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్ బావిలో దూకి వలస కూలీలు మృతి చెందారు. అధికారులు మృతులు బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. స్థానికంగా ఒక కంపెనీలో వీరు పని చేస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లలేకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది.

20 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన ఈ బిహార్‌ వలసకూలీలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి కూడా పోయే వీలు లేక వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురి మృతదేహలు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడుతో పాటు చిన్నారి ఉన్నారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది.