వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఆస్పత్రికి మద్యం మత్తులో వైద్యం కోసం వచ్చాడు. ఎక్స్‌రే అవసరమని చెప్పడంతో ఆ విభాగానికి వెళ్లాడు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని దూషిస్తూ విధుల్లో ఉన్న జూనియర్‌ డాక్టర్లపై కుర్చీ విసిరి దాడికి పాల్పడ్డాడు. తనకుతాను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మనిషినంటూ హడావుడి చేశాడు. విషయం తెలిసిన వెంటనే ఎంజీఎంకు చేరుకున్న మట్టెవాట పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడిపై దాడిని ఖండిస్తూ జూనియర్‌ డాక్టర్లు విధులను బహిష్కరించారు.