వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడంతో పాటు, ద్విచక్రవాహన చోరీలకపాల్పడతున్న నిందితుడిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడంతో పాటు, ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న కరీంనగర్‌ జిల్లా, హుజురాబాద్‌ మండలం ఇప్పల నర్సింగపూర్‌గ్రామానికి చెందిన గోవిందుల కుమార్‌ ఆలియాస్‌ కుమార స్వామిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను ఎల్కతుర్తి సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ మరియు సబ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ కేంద్రకారాగారంలో నిందితులకు జైలర్‌ సమక్షంలో పీ.డీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు.

పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు అందుకున్న నిందితుడు మరో నిందితుడితో కల్సి గత సంవత్సరం 2018లో ఎల్కతుర్తి పొలీస్‌ స్టేషన్‌పరిధిలో తాళం పగులగోట్టి బంగారు నగలతో పాటు ద్వీచక్ర వాహన చోరి పాల్పడిన కేసులో నిందితుడిని ప్రస్తుత సంవత్సరం జనవరి 3వ తేదిన ఎల్కతుర్తి అరెస్టు చేసి జైలుకు తరలించారు. పీడీయాక్ట్‌ అందుకున్న నిందితుడు గోవిందుల కుమార్‌ గత సంవత్సరంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 6 చోరీలకు పాల్పడగా కరీంనగర్‌ జిల్లాలో రెండు చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు 2003 సంవత్సరం నుండి చోరీలకు అలవాటు పడి కరీంనగర్‌ జిల్లాలో ద్వీచక్ర వాహనాల చోరీలకు పాల్పడటంతో నిందితుడిని పోలీసులు పలు మార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రించడంతో పాటు, ప్రజల ఆస్తులను చోరీలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, వారిపై పీడీ యాక్ట్‌ ను ప్రయోగించడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.